Babli: బాబుగారూ... మీరు 'వండర్' అండి!: ఎంపీ కవిత వ్యంగ్యం

  • ఎన్నికల వేళ బాబ్లీ గుర్తుకు వచ్చింది
  • స్కాంగ్రెస్ తో పెట్టుకుని విమర్శలా
  • 'అది ఓ బాబ్లీ డ్రామా' అన్న కవిత

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, చంద్రబాబుకు బాబ్లీ గుర్తుకురావడం వండర్ గా అనిపిస్తోందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో కొద్దిసేపటి క్రితం ఓ ట్వీట్ పెట్టారు. నేడు 'న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్' దినపత్రికలో వచ్చిన కథనాన్ని జోడించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వేళ చంద్రబాబుపై కేసు రిజిస్టర్ అయిందని గుర్తు చేస్తూ ఈ కథనం సాగగా, "తెలంగాణలో ఎన్నికల వేళ మాత్రమే బాబుగారికి బాబ్లీ గుర్తుకు రావడం అద్భుతం. ఆయనిలా రెండోసారి చేస్తున్నారు. 'స్కాంగ్రెస్'తో పొత్తు పెట్టుకుని బాబ్లీని వాడుకుంటున్నారు. ఆయన 'బాబ్లీ డ్రామా - నాన్ బెయిలబుల్ వారెంట్' మంచి విశ్లేషణ" అని కవిత వ్యాఖ్యానించారు.

More Telugu News