ISRO: ఇస్రో మరో ఘన విజయం.. కక్ష్యలోకి రెండు బ్రిటిష్ ఉపగ్రహాల చేరవేత!

  • అంతరిక్ష ప్రయోగాల్లో మరో విజయం
  • నింగిలోకి రెండు ఉపగ్రహాలు
  • వరదలు, విపత్తుల సమాచారాన్ని అందించనున్న ఉపగ్రహాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ‘గగన’ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం రాత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి రెండు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్‌వీ-సీ42 రాకెట్ ద్వారా బ్రిటన్‌కు చెందిన ఉపగ్రహాలు నోవాసర్, ఎస్1-4లను అంతరిక్షంలోకి చేరవేసింది. ఇది పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోగమనే చెప్పాలి.

 శనివారం మధ్యాహ్నం 1:08 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ఆదివారం రాత్రి 10:08 గంటలకు ముగిసి పీఎస్ఎల్‌వీ-సీ42 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 17 నిమిషాల 45 సెకన్లలో ప్రయోగం పూర్తయింది. 583 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది. పైకి పంపిన రెండు ఉపగ్రహాలు  భూ పరిశీలనతోపాటు వరదలు, విపత్తుల సమాచారాన్ని అందిస్తాయి. ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలను అభినందించారు.  

More Telugu News