Un Employment: అత్యాచారాలకు కారణం చెప్పిన బీజేపీ మహిళా నేత... విమర్శల వెల్లువ!

  • నిరుద్యోగ సమస్య పెరిగింది
  • యువతలో విసుగే రేప్ లకు కారణం
  • ప్రేమలతా సింగ్ వ్యాఖ్యలపై మండిపడుతున్న ప్రజలు

ఇండియాలో రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలకు నిరుద్యోగ సమస్య పెరగడమే కారణమని హర్యానా బీజేపీ మహిళా నేత, కేంద్ర మంత్రి వీరేందర్ సింగ్ సతీమణి ప్రేమలతా సింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ కాగా, ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.

 "మన దేశంలోని యువత మనసులోని విసుగే అత్యాచారాలకు కారణం. ప్రస్తుతం ఉద్యోగాలు లేక ఎంతో మంది అసంతృప్తితో ఉన్నారు. వారి భవిష్యత్తుపై ఆశలేకనే ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారు" అని ఆమె అన్నారు. సమాజంలో ఓ విష సంస్కృతి మొదలైందని, మహిళ ఎక్కడ కనిపించినా, పురుషుడు చెడుగానే చూస్తున్నాడని ఆమె అన్నారు. రాష్ట్రంలోని రెవారి ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ రేప్ ను ప్రస్తావిస్తూ ప్రేమలతా సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ బాధ్యతగల మహిళగా ఉండి ఈ తరహా వ్యాఖ్యలేంటని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News