నోకియా కొత్త ఫోన్ వివరాలు లీక్... వెనుకవైపు 5 కెమెరాలు, భారీ బ్యాటరీ!
- 'ఆండ్రాయిడ్ పై' సిస్టమ్ పై నోకియా 9
- 6.01 అంగుళాల డిస్ ప్లే, 8 జీబీ రామ్
- 4 ఎక్స్ ఆప్టికల్ జూమ్ అదనపు ఆకర్షణ
ఫోన్ వెనుక భాగం చిత్రం ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతుండగా, ఐదు కెమెరాలు కనిపిస్తున్నాయి. గతంలో లీకైన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ 'ఆండ్రాయిడ్ పై' సిస్టమ్ పై నడుస్తుందని, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 6.01 అంగుళాల డిస్ ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 8 బీజీ రామ్, 256 జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం, 41, 20, 9.7 మెగాపిక్సల్ కెమెరాలు, 4 ఎక్స్ ఆప్టికల్ జూమ్, ఎల్ఈడీ ఫ్లాష్ తదితరాలు ఉంటాయని తెలుస్తోంది.