payal raj puth: ఐటమ్ సాంగులో 'ఆర్ ఎక్స్ 100' భామ?

  • హీరోయిన్ గా పాయల్ కి మంచి క్రేజ్ 
  • వరుసగా వస్తోన్న అవకాశాలు 
  • కథ నచ్చితేనే గ్రీన్ సిగ్నల్
ఇటీవల కాలంలో చిన్న సినిమాగా థియేటర్స్ కి వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన చిత్రాలలో 'ఆర్ ఎక్స్ 100' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన పాయల్ రాజ్ పుత్ కి తొలి ప్రయత్నంలోనే విజయం లభించింది. గ్లామర్ పరంగా ఈ అమ్మాయి యూత్ నుంచి విపరీతమైన క్రేజ్ ను కొట్టేసింది. తెలుగులోనే కాకుండా తమిళం నుంచి వరుస అవకాశాలు వస్తున్నా, తొందరపడి చకచకా సినిమాలు ఒప్పేసుకోవడం లేదు.

పాత్ర నచ్చిన కారణంగా ఒక తెలుగు సినిమాలో కథానాయికగా ఆమె అంగీకరించింది. మరో సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే విషయం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి పాయల్ ను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అదుర్స్ అనిపించే స్థాయిలో ఆ సాంగ్ ఉండటమే అందుకు కారణమని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.  
payal raj puth

More Telugu News