Jana Sena: జనసేనలోకి విశాఖ టీడీపీ నాయకుడు విజయకుమార్?
- పవన్ కల్యాణ్‌ను కలిసిన సుందరపు
- గత కొంత కాలంగా అధికార పార్టీపై అసంతృప్తి
- నారా లోకేష్ బుజ్జగించినా మారని మనసు
విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం టీడీపీ నాయకుడు సుందరపు విజయకుమార్ జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న విజయకుమార్ శుక్రవారం పవన్ కల్యాణ్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నామినేటెడ్ పదవుల్లో స్థానం దక్కకపోవడంతో విజయకుమార్ నిరాశ చెందారు.
ఇదే విషయమై గతంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను కలిశారు. లోకేష్ బుజ్జగించినా స్పష్టమైన హామీ లభించక పోవడంతో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈలోగా జనసేన నుంచి ఆహ్వానం అందడంతో హైదరాబాద్‌లో ఆ పార్టీ అధినేతను కలిసినట్లు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌తో సమావేశం అయిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటానని విజయకుమార్ అన్నారు.