GVL Narasimha rao: టీడీపీ కేవలం డ్రామా రాజకీయాలకే పరిమితమైంది: జీవీఎల్

  • నోటీసుల అంశాన్ని టీడీపీ అవసరాల కోసం వాడుకుంటోందన్న జీవీఎల్
  • నిబంధనల ఉల్లంఘన కారణంగానే పోలీసులు దురుసుగా వ్యవహరించారు 
  • నోటీసుల కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం
ఏపీ సీఎం చంద్రబాబుకు ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేయడాన్ని టీడీపీ అవసరాల కోసం వాడుకుంటోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కేవలం డ్రామా రాజకీయాలకే పరిమితమైందని ఆరోపించారు.

2013లో ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు బాబ్లీ వద్దకు వెళ్లి నిబంధనలు ఉల్లంఘించడంతో, మహారాష్ట్ర పోలీసులు దురుసుగా వ్యవహరించారని అన్నారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయేనని... ఈ కేసుకీ... బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని జీవీఎల్ తెలిపారు. చంద్రబాబుపై ఉన్న కేసులన్నింటిపై స్టే ఉందని, ఓటుకు నోటు కేసు ఇంతవరకూ బయటకు రాలేదని జీవీఎల్ తెలిపారు.
GVL Narasimha rao
BJP
Chandrababu
Telugudesam
Dharmanabad court

More Telugu News