Arun Jaitly: మాల్యా తనను కలవలేదని అరుణ్ జైట్లీ చెప్పడం అబద్ధం: లలిత్ మోదీ

  • జైట్లీకి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందన్న లలిత్ 
  • ఇన్‌స్టా గ్రాం ద్వారా స్పందించిన లలిత్
  •  జైట్లీ చెబుతున్నదంతా అవాస్తమని వెల్లడి
పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నదంతా అవాస్తవమని ఐపీఎల్ కుంభకోణం నిందితుడు, ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న ఆయన అరుణ్ జైట్లీపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ మాల్యా భారత్ విడిచి వెళ్లే ముందు తనను కలవలేదని జైట్లీ చెప్పడం పూర్తి అబద్ధమన్నారు.

ఈ విషయమై తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్ ద్వారా స్పందించిన లలిత్.. జైట్లీకి అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందని, ఆయనొక నిరుపయోగమైన ఆర్థిక మంత్రి అని విమర్శించారు. జైట్లీని విజయ్ మాల్యా కలిశారని.. అది చాలా మందికి తెలుసని అన్నారు.
Arun Jaitly
vijay malya
lalith modi

More Telugu News