ఈ నెల 23 వరకూ వేచి చూద్దామంటున్న కొండా సురేఖ దంపతులు!
- తమ అనుచరులతో కొండా సురేఖ దంపతుల భేటీ
- టీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి స్పందన కోసం చూద్దాం
- పార్టీకి రాజీనామా చేయాలని సూచించిన అనుచరులు
ఈ నేపథ్యంలో హన్మకొండలోని రామ్ నగర్ లో తమ అనుచరులతో వారు సమావేశమయ్యారు. టీఆర్ఎస్ అధిష్ఠానం తమకు టికెట్లు ఇవ్వకుండా సస్పెన్స్ లో పెట్టడం, అనంతర పరిణామాల గురించి తమ కార్యకర్తలతో చర్చించినట్టు సమాచారం. కొండా దంపతులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు రావాలని వారికి కార్యకర్తలు సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొండా దంపతులు తమ అనుచరులతో పై వ్యాఖ్యలు చేశారు.