devineni Uma: దేవినేని ఉమాకు ప్రాణాహాని ఉంది.. జగన్ ఎంతో మందిని హత్య చేయించారు: రాజేంద్రప్రసాద్

  • వసంత నాగేశ్వరరావు, వసంత కృష్ణ ప్రసాద్ లపై కేసులు పెట్టాలి
  • ఉద్యోగులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు
  • హత్యా రాజకీయాలు చేయాలనుకునేవారిని కఠినంగా శిక్షించాలి
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ప్రాణహాని ఉందని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉమాను హత్య చేస్తామనే విధంగా మాట్లాడిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కృష్ణ ప్రసాద్ లపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను వైసీపీ నేతలు బెదిరిస్తుండటం దారుణమని అన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంతో మంది టీడీపీ నేతలు, కార్యకర్తలను వైసీపీ అధినేత జగన్ హత్య చేయించారని ఆరోపించారు. హత్యా రాజకీయాలు చేయాలనుకునే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 
devineni Uma
rajendraprasad
Telugudesam
vasntha nageswar rao
krishna prasad
ysrcp
murder

More Telugu News