visakha: పాదయాత్రలో జగన్ చెబుతున్న వన్నీ అసత్యాలే!: విశాఖ టీడీపీ నేతల విమర్శలు
- సభలలో ఎక్కువ మంది ఉన్నట్లు చూపించే ప్రయత్నం
- టీడీపీపై ఆరోపణలు చేసేందుకే జగన్ పాదయాత్ర
- విశాఖలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు
విశాఖపట్టణంలో జగన్ పాదయాత్రపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. జగన్ పాదయాత్రకు స్పందన లేదని, సభలలో ఎక్కువ మంది జనం ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గణబాబు విమర్శించారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, టీడీపీపై ఆరోపణలు చేసేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు.
టీడీపీకి చెందిన మరో నేత వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, నిన్న విశాఖలోని కంచరపాలెంలో పాదయాత్రలో జగన్ చెప్పినవన్నీ అసత్యాలేనని అన్నారు. ఒక్క విశాఖకే ఎన్నో ఐటీ కంపెనీలు వచ్చాయని, 2019 కల్లా టీడీపీ అనుకున్నవి సాధిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో విశాఖలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని ధీమా వ్యక్తం చేశారు.