Mallikarjun Kharge: ప్రతిపక్ష కూటమికి రాహులే బాస్: మల్లికార్జున ఖర్గే

  • బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారు
  • రాహుల్ నాయకత్వాన్ని అందరూ అంగీకరిస్తారు
  • ఆయన లాంటి నేత మరెవరికీ లేరు

బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, రాహుల్ గాంధీ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. నేడు కాకపోతే రేపైనా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సారథ్యాన్ని ప్రతిపక్ష కూటమి అంగీకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ పనితీరుపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీని గద్దె దించడమే విపక్ష పార్టీల లక్ష్యమని, అయితే, కూటమిని నడిపించేదెవరన్న విషయం ఎన్నికల తర్వాత తేలుతుందన్నారు.

రాహుల్‌ను నేతగా అందరూ అంగీకరిస్తున్నారని, ఆయన ఏం చెప్పినా వింటున్నారని ఖర్గే పేర్కొన్నారు. ఇటువంటి నేత ఇంకెవరికీ లేరని కితాబిచ్చారు. రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్న మోదీ బృందానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి రాహులే నాయకత్వం వహిస్తారని ఖర్గే తేల్చి చెప్పారు.

More Telugu News