Alibaba: 54 ఏళ్లకే రిటైర్మెంట్‌ ప్రకటించిన ‘అలీబాబా’ జాక్‌మా!

  • పుట్టిన రోజున పదవీ విరమణ చేస్తానని ప్రకటన
  • విశ్రాంత జీవితం సమాజసేవకు కేటాయిస్తానని వెల్లడి
  • ప్రపంచ కుబేరుల్లో జాక్‌మా ఒకరు

చైనాలో అత్యంత సంపన్నుడు, ఇ-కామర్స్‌ దిగ్గజం ‘అలీబాబా’ చైర్మన్‌ జాక్‌మా రిటైర్‌మెంట్‌ ప్రకటించి వాణిజ్యవర్గాల్లో సంచలనం రేపాడు. సోమవారం తన 54వ పుట్టిన రోజు సందర్భంగా పదవీ విరమణ చేయనున్నట్లు ప్రకటించాడు. విశ్రాంత జీవితాన్ని సమాజ సేవకు కేటాయిస్తానని వెల్లడించాడు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జాక్‌మా వృత్తిరీత్యా ఇంగ్లీష్‌ ఉపాధ్యాయుడు. 1999లో ఇ-కామర్స్‌ రంగంలోకి అడుగుపెట్టి ‘అలీబాబా’ను ఏర్పాటు చేశాడు. రెండు దశాబ్దాల కాలంలోనే అనితర సాధ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

 ప్రస్తుతం కంపెనీ విలువ 420.8 బిలియన్‌ డాలర్లు కాగా, జాక్‌మా సంపద విలువ 36.8 బిలియన్‌ డాలర్ల పైమాటే. 2013లోనే జాక్‌మా కంపెనీ సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. బిల్‌గేట్స్‌ తనకు ఆదర్శమని, ఆయన అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటించాడు. 

More Telugu News