Serena Williams: దొంగ, అబద్ధాల కోరు... కన్నీటిపర్యంతమవుతూ అంపైర్ ను తిట్టిన సెరీనా విలియమ్స్!

  • యూఎస్ ఓపెన్ ఫైనల్స్ లో నాటకీయ పరిణామాలు
  • 6-2, 6-4 తేడాతో ఓడిపోయిన సెరీనా విలియమ్స్
  • గ్రాండ్ స్లామ్ గెలిచిన తొలి జపాన్ క్రీడాకారిణిగా నిలిచిన ఒసాకా
  • ఓటమిని తట్టుకోలేక సహనాన్ని కోల్పోయిన సెరీనా

యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ పోటీల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సెంటర్ కోర్టులో జరిగిన పోరులో తన 24వ మేజర్ టైటిల్ పై కన్నేసిన సెరీనా విలియమ్స్, జపాన్ యువ క్రీడాకారిణి నవోమీ ఒసాకా మధ్య పోరు సాగగా, 6-2, 6-4 తేడాతో రెండు వరుస సెట్లలో ఒసాకా విజయం సాధించింది. ఈ విజయంతో ఓ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుచుకున్న తొలి జపాన్ క్రీడాకారిణిగా ఒసాకా చరిత్ర సృష్టించింది.

తొలి సెట్ ను కోల్పోయిన తరువాత సెరీనా విలియమ్స్ తన సహనాన్ని కోల్పోయింది. ఆమె తన కోచ్ ని సంప్రదించడంపై అభ్యంతరం చెప్పిన చైర్ అంపైర్ కార్లోస్ రామోస్ పై విరుచుకుపడింది. కోపంతో రంకెలేసింది. "నువ్వో అబద్ధాల కోరువి. దొంగవి. నాకు క్షమాపణలు చెప్పాల్సిందే" అంటూ రెచ్చిపోయింది. అంతకుముందు తన రాకెట్ ను బలంగా నేలకేసి కొట్టి విరిచింది. సెరీనా క్రమశిక్షణను ఉల్లంఘించినందున ఓ పెనాల్టీ పాయింట్ ను, చైర్ అంపైర్ ను దూషించినందుకు గేమ్ పెనాల్టీనీ విధించారు. మ్యాచ్ లో ఓటమి అనంతరమూ సెరీనా, యూఎస్ ఓపెన్ నిర్వాహకులపై విరుచుకుపడింది. మహిళలపై వివక్ష చూపిస్తున్నారని వాపోయింది.

More Telugu News