Vinayaka Chavithi: ఒక్క క్లిక్ దూరంలో వినాయక పూజ సామగ్రి... యువ టెక్కీ వినూత్న ఆలోచన!

  • ప్రకృతిలో మమేకమవుతూ జరుపుకునే వినాయకచవితి
  • 21 రకాల పత్రి సేకరణను సుసాధ్యం చేసిన 'ఆరాధ్య' కిట్
  • మూడు రకాల ప్యాకేజీల్లో అందుబాటులోకి

ప్రకృతిలో మమేకమవుతూ, భక్తితో, నమ్మకంతో సంప్రదాయబద్ధంగా జరుపుకునే పర్వదినాల్లో వినాయక చవితి ఒకటి. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుతూ, గణనాధుని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు.

అయితే, వినాయకుడి పూజకు అవసరమైన పూజా సామగ్రి, పత్రిని సేకరించడం అంత సులువైన పని కాదు. అసలు పూజకోసం ఏయే రకాల పత్రిని సేకరించాలో కూడా చాలామందికి తెలియదు. గణపతి పూజకు వినియోగించే పత్రులు ఇవేనంటూ రోడ్ల పక్కన విక్రయించే ఆకులనే రెండో ఆలోచన లేకుండా కొనేసుకుంటాం. వాటితోనే వినాయకుడి పూజను పూర్తి చేసేస్తాం.ఇప్పుడు ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టింది 'ఆరాధ్య' అనే ఆన్ లైన్ కంపెనీ. లంకొత్తు వేణుగోపాల స్వామి అనే యువ టెక్కీ మదిలో పుట్టిన ఆలోచనే ఈ కంపెనీ. వినాయకుడి పూజకు అవసరమైన విగ్రహ ప్రతిమతో పాటు, 18 రకాల పూజా సామాగ్రి,   21 రకాల పత్రులను ఓ ప్యాక్ ద్వారా భక్తులకు అందించాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

మొత్తం మూడు రకాల ప్యాకేజీల్లో ఆరాధ్య కిట్ అందుబాటులో ఉంటుంది. మట్టితో తయారైన 9 అంగుళాల విగ్రహం, 21 రకాల పత్రి, 18 రకాల పూజా సామాగ్రిని రూ. 999కు అందిస్తున్నట్టు వేణుగోపాల స్వామి వెల్లడించారు. రూ. 888కి ఆరు అంగుళాల వినాయకుడి ప్రతిమ, 21 రకాల పత్రి, 18 రకాల పూజా సామాగ్రిని, రూ. 499కి ఆరు అంగుళాల ప్రతిమ, పత్రిని అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో డోర్ డెలివరీకి ఏర్పాట్లు చేశామని, పికప్ లొకేషన్ కు వచ్చి పూజా సామాగ్రిని తీసుకోవాలని భావించే వారికి రూ. 50 డిస్కౌంట్ ను అందిస్తున్నామని తెలిపారు.21 రకాల పత్రిలో భాగంగా మాచీ పత్రం, బృహతి పత్రం, బిల్వ పత్రం, దుర్వార పత్రం, దాత్తూర పత్రం, బదరీ పత్రం, అపామార్గ పత్రం, తులసి పత్రం, చూత పత్రం, కరవీర పత్రం, విష్ణుకాంత పత్రం, దామినీ పత్రం, దేవదారు పత్రం, మరువక పత్రం, సింధువార పత్రం, జాజి పత్రం, గండకీ పత్రం, షమీ పత్రం, అశ్వథ పత్రం, అర్జున పత్రం, అర్క పత్రం ఈ కిట్ లో లభిస్తాయి.

పూజకు అవసరమయ్యే పసుపు, కుంకుమ, గంధం, ముగ్గు, అక్షింతలు, కర్పూరం, కంకణం, వస్త్రం, యజ్ఞోపవీతం, సాంబ్రాణి, దీపాలు, నూనె, వత్తులు, తేనె, పంచదార, ఆవునెయ్యి, గంగాజలం, అగరుబత్తి, తాంబూలం, పాలవెల్లి, కొబ్బరికాయ, పూజా విధానం పుస్తకం ఈ కిట్ లో లభిస్తాయి.ఈ పూజా కిట్ ను పొందాలంటే www.aaradhyakit.com వెబ్ సైట్లోకి లాగిన్ అయి బుక్ చేసుకోవచ్చు. లేదా 9494563839 వాట్సాప్ నంబరును సంప్రదించవచ్చు. గురువారం, 13వ తేదీన వినాయకచవితి పర్వదినం ఉండగా, పూజా కిట్ ను ఆర్డర్ చేసుకున్న వారికి 12వ తేదీ బుధవారం నాడు డెలివరీ ఇస్తామని సంస్థ ప్రకటించింది.

More Telugu News