కాంగ్రెస్ బంద్ పిలుపునకు ఆర్జేడీ మద్దతు
- పెట్రో ధరల పెరుగుదలపై భగ్గుమన్న కాంగ్రెస్
- ఈ నెల 10న భారత్ బంద్
- కలిసి వస్తామన్న ఆర్జేడీ
గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను సామాన్యులను షాక్‌కు గురిచేస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే పెట్రోలు ధర లీటర్‌కు 48 పైసలు, డీజిల్‌పై 47 పైసలు పెరిగాయి. ధరలను రోజువారీగా సవరించడం మొదలుపెట్టిన తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.79.99కి చేరుకుని రికార్డు సృష్టించగా, డీజిల్ ధర లీటర్ రూ.72.07గా నమోదైంది. ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ.87.39, డీజిల్ రూ.76.51గా ఉంది. 16 ఆగస్టు నుంచి 31వ తేదీ మధ్య పెట్రోలు లీటర్‌కు రూ.2.85, డీజిల్ రూ3.30 పెరిగింది.