Jana Reddy: జానారెడ్డికి నిజాయతీ ఉంటే ఆ పని చేసి చూపించాలి!: సీఎం కేసీఆర్

  • వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం
  • అప్పుడు, జానారెడ్డి ఏమన్నారు?
  • అలా చేస్తే గులాబీ కండువా కప్పుకుంటానన్నారు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కరెంట్ విషయంలో భయంకరమైన సమస్యలు ఉండేవని  సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఇరవైనాలుగు గంటల విద్యుత్ సరఫరా చేస్తామని నాడు తాము చెబితే, ‘అది సాధ్యమౌతుందా?’ అని కాంగ్రెస్ నేత జానారెడ్డి ప్రశ్నించిన విషయాన్ని ప్రస్తావించారు.

 వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తే, తానే గులాబీ కండువా కప్పుకొని, టీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తానని జానారెడ్డి నాడు శాసనసభలో చెప్పారని, మరి, ఆయనకు నిజాయతీ ఉంటే ఆ పని చేసి చూపించాలని ఎద్దేవా చేశారు. జానారెడ్డికి కళ్లుంటే 24 గంటల విద్యుత్ వస్తుందో, రావట్లేదో చెప్పాలని, కళ్లు కనిపించకపోతే, ఉచిత కంటి వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

More Telugu News