nedurumalli: రేపు వైసీపీలో చేరనున్న నేదురుమల్లి రాంకుమార్

షార్ట్స్‌లో చూడండి
దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రాంకుమార్ వైసీపీలో చేరనున్నారు. రేపు విశాఖపట్టణంలో జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల నుంచి నేదురుమల్లి కుటుంబసభ్యులు తమ అనుచరగణాన్ని   విశాఖకు తీసుకెళ్లనున్నారు. గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనాలలో, సుమారు రెండు వేల మందిని తరలిచేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, వైసీపీలో తాను చేరనున్నట్టు రాంకుమార్ ఇటీవలే ప్రకటించారు.
Go Back to Shorts
nedurumalli
YSRCP
ramkumar

More Telugu News