kutumbarao: తనకు సవాల్ విసిరిన కుటుంబరావుపై నిప్పులు చెరిగిన ఉండవల్లి!

  • చంద్రబాబుపై ఈర్ష్య ఉంటే ఆయన్ని ఎందుకు కలుస్తా?
  • ‘రాజా ఆఫ్ కరప్షన్’పై బహిరంగ చర్చకు నేను సిద్ధమే
  • వైఎస్ అవినీతికి పాల్పడలేదని నేనెప్పుడైనా చెప్పానా?

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈర్ష్యతో అమరావతి బాండ్ల అమ్మకంపైనా, సీఎం చంద్రబాబునాయుడుపైనా హేళనగా మాట్లాడుతున్నారని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఇటీవల వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. చంద్రబాబుపై ఈర్ష్య ఉంటే తాను ముఖ్యమంత్రి చంద్రబాబును ఎందుకు కలుస్తానని ప్రశ్నించారు.

 ‘రాజా ఆఫ్ కరప్షన్’ పుస్తకంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడలేదని తానెప్పుడైనా చెప్పానా? అని ప్రశ్నించిన ఉండవల్లి, మార్గదర్శి’పై త్వరలో మరిన్ని వాస్తవాలు బయటపెడతానని అన్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటున్న కుటుంబరావు, టీడీపీ ప్రతినిధిగా మారారని ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News