Chandrababu: నందమూరి హరికృష్ణ పెద్దకర్మకు వెళ్లనున్న చంద్రబాబు!

  • ఈ నెల 8న హైదరాబాద్ లో పెద్దకర్మ కార్యక్రమం
  • ఆ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు
  • ఆ రోజు మధ్యాహ్నమే టీ-టీడీపీ నేతలతో బాబు భేటి?  

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, నటుడు నందమూరి హరికృష్ణ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నెల 8న హరికృష్ణ పెద్దకర్మ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం, హరికృష్ణ బావ నారా చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. అనంతరం, అదేరోజు మధ్యాహ్నం తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటి కానున్నట్టు సమాచారం. పొత్తులు, ఇతర రాజకీయ విషయాలపై టీ-టీడీపీ నేతలతో ప్రాథమిక స్థాయిలో చర్చించనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

More Telugu News