kcr: ఎన్నికలకు ముందే కృష్ణా, గోదావరి నీళ్లు ఇస్తాం: సీఎం కేసీఆర్

  • మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లివ్వకుంటే ఓట్లు అడగనని చెప్పా
  • ఏ ముఖ్యమంత్రి ఇంత ధైర్యంగా చెప్పలేదు
  • దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ 
వచ్చే ఎన్నికలలోపే ఇంటింటికీ కృష్ణా, గోదావరి నీళ్లు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కొంగరకలాన్ లో జరిగిన ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలలోపు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పానని, ఏ ముఖ్యమంత్రీ ఇంత ధైర్యంగా చెప్పలేదని అన్నారు.

 22 వేల గ్రామాలకు నీరు అందుతోందని, మరో 1500 గ్రామాలకు వారం పది రోజుల్లో తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు జిల్లాలో 9 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చామని, వలసపోయిన పాలమూరు కూలీలు తిరిగి సొంతూళ్లకు వెళ్తున్నారని చెప్పారు. ఆర్థిక ప్రగతిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అని, రాష్ట్ర వృద్ధి రేటు 17.83 శాతంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
kcr
kongarakalan

More Telugu News