kcr: శాసనసభ రద్దుపై మీడియాలో కథనాలు సబబు కాదు: సీఎం కేసీఆర్
- ప్రజల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకుంటాం
- కేశవరావు అధ్యక్షతన త్వరలో మేనిఫెస్టో కమిటీ
- మళ్లీ అధికారంలోకొస్తే ఏం చేస్తామో ఈ మేనిఫెస్టోలో చెబుతాం
తెలంగాణ శాసనసభ రద్దుపై మీడియాలో అనేక కథనాలు వచ్చాయని ఇలాంటి వార్తలు రాయడం సబబు కాదని సీఎం కేసీఆర్ హితవు పలికారు. కొంగరకలాన్ లో జరిగిన ప్రగతి నివేదన సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు వెళ్లే విషయమై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ నిర్ణయాన్ని తనకు అప్పగించారని, తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు అధ్యక్షతన త్వరలో మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తామని, ఎన్నికల మేనిఫెస్టో వివరాలను ప్రజల ముందుకు తెస్తామని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ఈ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని, ఇందులోని అంశాలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని, తెలంగాణ ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాంలా ఉందామంటున్నాయని, అధికారంలో ఉంటే ఆత్మగౌరవంతో ఉంటామని, తమిళనాడు రాష్ట్రం తరహాలో మన రాష్ట్రాన్ని మనమే పాలించుకుందామని, రాజకీయ నిర్ణయాలు త్వరలోనే ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు.