Kongarakalan: కొంగరకలాన్ వద్ద అరుదైన ఘటన... ఎస్పీగా ఉన్న కూతురికి డీసీపీగా ఉన్న తండ్రి సెల్యూట్!

  • మల్కాజిగిరి డీసీపీగా ఉన్న ఉమామహేశ్వర శర్మ
  • జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ
  • ఇద్దరికీ ప్రగతి నివేదన సభ భద్రతా బాధ్యతలు

నేడు ప్రగతి నివేదన సభ జరగనున్న కొంగర కలాన్ వద్ద దాదాపు 20 వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తుండగా, ఓ ఆరుదైన సంఘట చోటు చేసుకుంది. ఒక వేదిక వద్ద తండ్రి, కూతురు బందోబస్తు అధికారులుగా విధులకు హాజరుకాగా, తనకన్నా పెద్ద హోదాలో విధుల్లో ఉన్న కుమార్తెకు, ఓ తండ్రి సెల్యూట్ చేశారు. ఆ తండ్రి మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ కాగా, కుమార్తె జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ. వీరిద్దరూ ప్రగతి నివేదన సభా ప్రాంగణంలో పోలీసు డ్యూటీలో ఉన్నారు.

సాంస్కృతిక వేదిక, మహిళలకు కేటాయించిన గ్యాలరీలకు ఇన్ చార్జ్ గా సింధూ శర్మ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఉమామహేశ్వర శర్మ సభా వేదిక వద్ద బందోబస్తుకు ఇన్ చార్జ్ గా పని చేస్తున్నారు. ఉమామహేశ్వర శర్మ 1985 సంవత్సరంలో ఎస్‌ఐగా విధుల్లో చేరి, నాన్‌ క్యాడర్ ఎస్పీ హోదాకు వచ్చారు. సింధూశర్మ 2014 బ్యాచ్ ఐపీఎస్‌ గా ఎంపికై పెద్దపల్లిలో తొలి పోస్టింగ్ తెచ్చుకుని, ఇటీవలే జగిత్యాల ఎస్పీగా బదిలీ అయ్యారు. పోలీసు డ్యూటీలో భాగంగా నాన్ క్యాడర్ ఎస్పీ హోదాలో ఉమామహేశ్వర శర్మ ఐపీఎస్ అధికారిణి అయిన కూతురు సింధూకు సెల్యూట్ చేయడం అరుదైన ఘటన.

More Telugu News