Nagarjuna sagar: కాసేపట్లో తెరచుకోనున్న నాగార్జున సాగర్ గేట్లు!

  • క్రస్ట్ గేట్లను ఎత్తివేయనున్న అధికారులు
  • ఇప్పటికే పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి
  • కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల

చాలా సంవత్సరాల తరువాత నాగార్జున సాగర్ నీటిమట్టం సెప్టెంబర్ తొలివారంలోనే పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరింది. దీంతో ఈ ఉదయం సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి నిన్నే సాగర్ గేట్లను ఎత్తుతారని భావించినప్పటికీ, ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం స్వల్పంగా తగ్గడంతో గేట్లను తెరిచే కార్యక్రమాన్ని ఒకరోజు వాయిదా వేశారు. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో సాగుతుండగా, కుడి, ఎడమ కాలువలకు కూడా నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సాగర్ కు దాదాపు 70 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది.

More Telugu News