ఆలస్యంగా థియేటర్లకు నయన్ మూవీ .. నిరాశచెందిన అభిమానులు

- నయన్ తాజా చిత్రంగా 'ఇమైక్కా నోడిగళ్'
- నిన్ననే తమిళనాట విడుదల
- పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టిన నయన్
అయితే నిర్మాతలకి .. డిస్ట్రిబ్యూటర్లకు మధ్య ఆర్థికపరమైన లావాదేవీల్లో సమస్య కారణంగా, నిన్న ఈ సినిమా మొదటి రెండు ఆటలను రద్దు చేశారు. ఆ తరువాత ఈ సినిమా థియేటర్స్ కు వచ్చింది. ఆలస్యమైనా తొలి ఆటతోనే ఈ సినిమా సక్సెస్ టాక్ ను తెచ్చేసుకుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నయనతార ఎక్కువ మార్కులు కొట్టేసింది. సాధారణంగా నయనతారకి గల క్రేజ్ కారణంగా భారీ ఓపెనింగ్స్ ఉంటాయి. అయితే ఆలస్యంగా ఈ సినిమా థియేటర్స్ కి రావడం వలన ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం పడింది. దాంతో నయన్ అభిమానులు నిరాశ చెందారు.