లేడీ ఓరియెంటెడ్ మూవీకి కాజల్ గ్రీన్ సిగ్నల్?

- తమిళంలో 'క్వీన్' రీమేక్ లో చేస్తోన్న కాజల్
- తెలుగులో తేజ దర్శకత్వంలోను ఒక సినిమా
- లేడీ ఓరియెంటెడ్ కథలపై దృష్టి
గతంలో కొన్ని చిన్న సినిమాలు చేసిన అనుభవమున్న దర్శకుడు భానుశంకర్ ఇటీవల కాజల్ ను కలిసి ఒక లైన్ వినిపించాడట. లైన్ బాగుందని చెప్పిన కాజల్ .. పూర్తిస్థాయిలో కథను సిద్ధం చేసుకుని రమ్మని చెప్పిందట. ఆ దర్శకుడు కథపై కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. కథ నచ్చితే కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో ఆమె తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.