సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం.. లారీ-తూఫాన్ ఢీ.. నలుగురి దుర్మరణం
- శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఘోరం
- వెనక నుంచి లారీని ఢీకొట్టిన వాహనం
- బాధితులు హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్ వాసులు
బాధితులను హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్‌కు చెందినవారిగా గుర్తించారు. కర్ణాటకలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదానికి గురైన రెండు వాహనాలను కర్ణాటకకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.