Harikrishna: సీటు బెల్టు గురించి మాట్లాడడం అనవసరం... దేవుడు పిలిచాడంతే!: పెల్లుబుకుతున్న కన్నీటితో వైవీఎస్ చౌదరి

  • హరికృష్ణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న వైవీఎస్ చౌదరి
  • సీట్ బెల్ట్ ఆయనకు అలవాటు లేదంతే
  • దాని గురించిన మాటలు వృథా
  • ఎవరికీ ప్రమాదాలకు గురి కావాలని ఉండదన్న వైవీఎస్

"తాను డ్రైవింగ్ చేస్తున్న కారులో సీటు బెల్టు పెట్టుకుని ఉంటే హరికృష్ణ బతికేవారు" నిన్నటి నుంచి వినిపిస్తున్న ఈ మాటలపై వైవీఎస్ చౌదరి స్పందించారు. హరికృష్ణతో 'సీతయ్య', 'లాహిరి లాహిరి లాహిరిలో' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఆయన ఓ టీవీ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో హరికృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టారు.

సీటు బెల్టును హరికృష్ణ పెట్టుకోలేదని ఇప్పుడు మాట్లాడడం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. హరికృష్ణ చిన్నతనం నుంచే అన్ని రకాల వాహనాలనూ నడిపేవారని గుర్తు చేసిన ఆయన, అప్పటి వాహనాల్లో సీట్ బెల్ట్ ఉండేది కాదని, దాంతో ఆయనకు అలవాటు కాలేదని చెప్పారు. సీటు బెల్టు పెట్టుకుంటే, తనను కట్టేసినట్టుగా అనిపిస్తుందని ఆయన చెప్పేవారని వైవీఎస్ చౌదరి అన్నారు.

ఆయన తరువాత వచ్చి, కార్లను కొనుక్కున్న తనకు, హరికృష్ణ కొడుకులకు సీటు బెల్టు అలవాటేనని చెప్పిన వైవీఎస్, ఎవరికీ ప్రమాదాలు జరగాలని ఉండదని, హరికృష్ణను దేవుడు పిలిచాడని అభిప్రాయపడ్డారు. సీటు బెల్టు గురించి మాట్లాడటం వృథా అని అన్నారు.

More Telugu News