harikrishna: హరికృష్ణ అంతిమయాత్ర 'చైతన్యరథం'లో కాదట!

  • 'ఎన్టీఆర్' బయోపిక్ కోసం సిద్ధమవుతున్న చైతన్య రథం
  • రామకృష్ణ స్టూడియోస్ లో కొనసాగుతున్న రిపేర్లు
  • అంతిమయాత్రకు ఆ వాహనం వద్దనుకుంటున్న కుటుంబసభ్యులు
తన తండ్రి తారక రామారావు చైతన్య రథానికి సారథిగా వ్యవహరించి... తండ్రి అఖండ విజయంలో కీలకపాత్ర పోషించారు హరికృష్ణ. చైతన్యరథంతో ఆయనకున్న అనుబంధం చాలా ఎక్కువ. అన్న టీడీపీనీ స్థాపించిన తర్వాత కూడా ఆయన చైతన్య రథంపైనే ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలకు అదే చైతన్య రథాన్ని ఉపయోగించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. కానీ, ఆ వాహనం అందుబాటులో లేకపోవడంతో, ఇప్పుడు మరో వాహనాన్ని అంతిమయాత్రకు సిద్ధం చేస్తున్నారు.

'ఎన్టీఆర్' బయోపిక్ కోసం చైతన్య రథాన్ని ఆర్ట్ డిపార్ట్ మెంట్ కు తరలించినట్టు సమాచారం. రామకృష్ణ స్టూడియోలో ఉన్న ఈ రథానికి ప్రస్తుతం రిపేర్లు జరుగుతున్నాయి. మరోవైపు, చైతన్య రథం ఓ మధుర జ్ఞాపకంలా మిగిలిపోవాలని, అంతిమయాత్రకు ఆ వాహనాన్ని ఉపయోగించడం బాగుండదని కుటుంబసభ్యులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, అంతిమయాత్రకు మరో వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు. 
harikrishna
chaitanya ratham

More Telugu News