Harikrishna: 20 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున... హరికృష్ణ జీవితంలో ఓ పేజీ!

  • 1999, ఆగస్టు 30న రాయచోటిలో హరికృష్ణ
  • ఆపై పీలేరులో ఎన్నికల ప్రచారం
  • చైతన్య రథంపైనే ప్రజల్లో తిరిగిన హరికృష్ణ
అది 1999 ఆగస్టు 30... అంటే 20 సంవత్సరాల క్రితం... అప్పటికే అన్న తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన హరికృష్ణ, కడప జిల్లా రాయచోటి ప్రాంతంలో ఉన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత, వినియోగించిన చైతన్య రథాన్ని తన ప్రచార రథంగా వాడుతూ, ప్రజల్లో ఉన్నారు. రాయచోటిలో ప్రచారాన్ని ముగించుకున్న తరువాత, పీలేరుకు వచ్చిన ఆయన, గ్రామ పంచాయితీ ఆఫీస్ ముందు రోడ్ షో నిర్వహించారు.

పీలేరు నుంచి అన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లెపు చిన్న రెడ్డప్పను గెలిపించాలని ఓటర్లను కోరారు హరికృష్ణ. ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చాలంటే అన్న తెలుగుదేశం అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు. నాడు ఆయన చిత్తూరు బాబు ఇంట్లో విందు కూడా చేశారు. 20 సంవత్సరాల క్రితం ఇదే రోజున తమ ప్రాంతంలో హరికృష్ణ పర్యటించారని గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడి ప్రజలు.
Harikrishna
Chaitanya Ratham
Anna Telugudesam
Kadapa District

More Telugu News