ఆర్టీసీలో మహిళా కండక్టర్ల నియామకం హరికృష్ణ చలవే!
- మంత్రిగా నిర్ణయం తీసుకున్న హరి
- మహిళా కండక్టర్లు ఉండాలని కోరుకున్న నేత
- నేడు జూబ్లిహిల్స్ లో అంత్యక్రియలు
టీడీపీలో ఉన్నా తనకు నచ్చని విషయాల్లో పార్టీ అధిష్ఠానాన్ని సైతం హరికృష్ణ ధిక్కరించేవారు. ఏ విషయంలో అయినా డొంకతిరుగుడుగా మాట్లాడటం ఆయనకు నచ్చని పని. ఏదైనా ముక్కుసూటిగానే మాట్లాడేవారు. అలాగే ఆర్టీసీలో మహిళా కండక్టర్లు ఉండాలనీ, అమ్మాయిలు ఎలాంటి విధులనైనా సమర్థవంతంగా నిర్వహించగలరని హరికృష్ణ తరచూ చెప్పేవారు. అందుకు అనుగుణంగానే మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మహిళా కండక్టర్ల నియామకంతో పాటు పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చారు.