నందమూరి హరికృష్ణ మృతిపై ఏపీసీసీ దిగ్భ్రాంతి
- హరికృష్ణ మృతికి సంతాపం తెలియజేస్తున్నాం
- ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి
- ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
నిజాయతీ గల నేత హరికృష్ణ
హరికృష్ణ హఠాన్మరణం చెందడం దిగ్భ్రాంతి కలిగించిందని ఏఐసీసీ సభ్యుడు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అన్నారు. హరికృష్ణ మృతి రాష్ట్ర రాజకీయాలకు, సినీ పరిశ్రమకు పూడ్చలేని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. నీతి, నిజాయతి ఉన్న నాయకులలో హరికృష్ణ ఒకరని కొలనుకొండ శివాజీ కొనియాడారు.