harikrishna: నోరారా అమ్మా అని పిలిచేవాడు.. తట్టుకోలేకపోతున్నా: లక్ష్మీపార్వతి

షార్ట్స్‌లో చూడండి
నందమూరి హరికృష్ణ అకాల మృతిపై లక్ష్మీపార్వతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హరికృష్ణ మరణ వార్తను విని తట్టుకోలేక పోతున్నానని అన్నారు. తనను నోరారా అమ్మా అని పిలిచేవాడని తెలిపారు. ఎన్టీఆర్ తో పెళ్లి విషయంలో తనతో తొలుత విభేదించినప్పటికీ, ఆ తర్వాత చాలా బాగా కలసిపోయాడని చెప్పారు. దివంగత ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని సంతకాల సేకరణ చేపట్టినప్పుడు, సంతకాల సేకరణ కోసం హరికృష్ణని కలిశానని... సంతకం చేశాడని తెలిపారు. హరికి డ్రైవింగ్ అంటే ఎంతో ఇష్టమని, డ్రైవింగ్ లో సుదీర్ఘ అనుభవం ఉందని, కానీ మృత్యువు ఎలా వెంటాడిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండాల్సిందని అన్నారు.
Go Back to Shorts
harikrishna
lakshmi parvathi

More Telugu News