byappanahalli: చైన్ స్నాచర్లపై పాటపాడిన పోలీస్.. శెభాష్ అంటూ బహుమానం అందజేసిన కమిషనర్!

  • బెంగళూరులో యువ పోలీస్ చొరవ
  • పాటతో చైన్ స్నాచింగ్ పై అవగాహన
  • అభినందించిన నగర కమిషనర్

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇటీవలి కాలంలో చైన్ స్నాచర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రోడ్డుపై వెళ్లే వారు, ఒంటరిగా ఇళ్లలో ఉన్న మహిళలే లక్ష్యంగా ఈ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో చైన్ స్నాచింగ్ ఘటనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బెంగళూరులోని ఓ యువ కానిస్టేబుల్ చొరవ తీసుకున్నాడు. స్వయంగా తాను పాట పాడుతూ ఓ వీడియోను రూపొందించాడు. ఈ వీడియోపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

కర్ణాటకలోని బయ్యప్పనహళ్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్య చైన్ స్నాచింగ్ లపై నాలుగు నిమిషాల నిడివి ఉన్న వీడియోను రూపొందించాడు. దీనికి కన్నడ సంగీత దర్శకుడు హేమంత్ సంగీతం అందించాడు. చైన్ స్నాచింగ్ లు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అందులో సుబ్రహ్మణ్య వివరించాడు. ఈ వీడియోను ఇంటర్నెట్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీంతో సుబ్రహ్మణ్య చొరవను మెచ్చుకున్న బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్.. ప్రత్యేక బహుమానం అందజేశారు.

More Telugu News