Varavararao: 'ప్రధాని మోదీ హత్యకు కుట్ర' కేసు: వరవరరావు ఇంట్లో మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ పోలీసుల సోదాలు!

  • తెలంగాణ పోలీసుల సహకారంతో దాడులు
  • ఇప్పటికే వీరిపై పుణెలో నమోదైన కేసు
  • పలు పత్రాలు, కంప్యూటర్ల పరిశీలన
ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర చేసిన వారికి సహకరించారన్న ఆరోపణలపై విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు, జర్నలిస్టులు కూర్మనాథ్, టేకుల క్రాంతి, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ ఇళ్లపై పోలీసులు దాడులు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఉదయం వీరిరువురి ఇళ్లలో మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందాలు, తెలంగాణ పోలీసుల సహకారంతో దాడులు చేశాయి. వరవరరావు, క్రాంతిలపై గతంలోనే పుణెలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో భాగంగా వారి ఇళ్లలో పలు పత్రాలు, పుస్తకాలు, కంప్యూటర్లను వీరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Varavararao
Kranti
police
Narendra Modi

More Telugu News