Amaravati: మొన్న జగన్ ను కలిసిన మాజీ డీజీపీ సాంబశివరావు... నేడు చంద్రబాబుతో చర్చలు!

  • అమరావతికి వచ్చిన సాంబశివరావు
  • సీఎంతో సుమారు 20 నిమిషాల చర్చ
  • కొత్త రాజకీయ చర్చ మొదలు!
  ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ సాంబశివరావు ఈ ఉదయం అమరావతికి వచ్చి సీఎం చంద్రబాబునాయుడిని కలిశారు. మూడు రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను కలిసిన తరువాత సాంబశివరావు ఆయన పార్టీలో చేరనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబును సాంబశివరావు కలవడం మరో కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. వీరిరువురూ సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్టు తెలుస్తుండగా, వారి మధ్య జరిగిన సంభాషణల వివరాలు బయటకు రాలేదు.  
Amaravati
EX DGP
Sambasivarao
Chandrababu

More Telugu News