YSRCP: సెప్టెంబర్ 2న వైసీపీలో చేరుతున్నా: ఆనం రామనారాయణరెడ్డి

  • టీడీపీలో సైద్ధాంతిక సిద్ధాంతం లేదు
  • వైసీపీతో కలసి నడుస్తాం
  • జగన్ కు పూర్తి అండదండలందిస్తాం
టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి ఆ పార్టీని వీడనున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆనం ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలో సైద్ధాంతిక సిద్ధాంతం లేదని, కక్ష సాధింపు చర్యలతో రాజకీయాల్లో మనుగడ సాగించలేరని అన్నారు. గత పదేళ్లుగా సెప్టెంబర్ 2ను తామందరం గుర్తుంచుకున్న రోజు.. బాధపడిన రోజు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణవార్త విన్న సందర్భమని అన్నారు. నెల్లూరు నగరంలో ఈ రోజున ఆత్మీయసమావేశం నిర్వహించామని, వైసీపీతో కలసి నడవాలని, జగన్మోహన్ రెడ్డికి పూర్తి అండదండలు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
YSRCP
anam

More Telugu News