kcr: ‘డీల్’ని అనుసరించి కేసీఆర్ లేదా కేటీఆర్ దగ్గరకు తీసుకెళతారు: రేవంత్ రెడ్డి ఆరోపణలు

  • కోటి నుంచి పది కోట్ల లంచం అయితే కేటీఆర్ కు
  • వందకోట్లు, ఆపైన అయితే కేసీఆర్ కు 
  • వారి వద్దకు మధ్యవర్తులు తీసుకెళతారని ప్రజలు అనుకుంటున్నారు 
కోటి నుంచి పది కోట్ల లంచం అయితే కేటీఆర్ తీసుకుంటాడు, వంద కోట్లు, ఆపైన అయితే కేసీఆర్ తీసుకుంటాడని ప్రజలు అనుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘డీల్’ ని అనుసరించి కేసీఆర్ వద్దకో.. లేక కేటీఆర్ దగ్గరకో మధ్యవర్తులు తీసుకెళతారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తులు తమపై ఎదురుదాడి చేయడం వల్ల ప్రయోజనం లేదని, ప్రగతి నివేదన సభ నిర్వహణకు సంబంధించి ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ లకు ఉందని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

‘నువ్వూ నేనూ.. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిద్దాం. ఒకపక్క నుంచి నువ్వు రా..మరో పక్క నుంచి నేనొస్తా. ప్రజలు ఎవరి పక్షాన నిలబడతారో చూద్దాం కేటీఆర్!’ అని రేవంత్ సవాల్ విసిరారు. ముందస్తు ఎన్నికల గురించి, ప్రగతి నివేదన సభా నిర్వహణ ఖర్చు గురించి కేసీఆర్, కేటీఆర్ లు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
kcr
KTR

More Telugu News