Sagar: మరో 18 అడుగులు... 262 టీఎంసీలు దాటిన నాగార్జున సాగర్ నీటి నిల్వ!

  • 572 అడుగులు దాటిన సాగర్ నీటిమట్టం
  • 262 టీఎంసీలకు నీటి నిల్వ
  • శ్రీశైలంలో 883 అడుగుల మేరకు నీరు

శ్రీశైలం నుంచి వస్తున్న వరద కొనసాగుతూ ఉండటంతో నాగార్జున సాగర్ రిజర్వాయర్ శరవేగంగా నిండుతోంది. దాదాపు 75 వేల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వస్తుండగా, 590 అడుగుల ప్రాజెక్టులో ప్రస్తుతం 572.20 అడుగులకు నీరు చేరుకుంది. జలాశయంలో మొత్తం 262 టీఎంసీలకు నీటి నిల్వ చేరిందని అధికారులు వెల్లడించారు.

కాగా, కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలానికి ప్రవాహం తగ్గగా, గేట్లను మూసివేసిన అధికారులు, విద్యుత్ ఉత్పత్తిని మాత్రం నిలుపలేదు. ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, ఆ మొత్తాన్నీ దిగువకు వదులుతున్నారు. 885 అడుగుల నీటి నిల్వ సామర్థ్యమున్న శ్రీశైలం జలాశయంలో 883 అడుగుల మేరకు నీటిని నిర్వహిస్తూ, వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతామని అధికారులు వెల్లడించారు.

More Telugu News