రుషికేశ్ లో ఉగ్ర గంగమ్మ... వీడియో చూడండి!

26-08-2018 Sun 12:34
  • దేశవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు
  • ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్న గంగానది
  • నీటిలో మునిగిన స్నాన ఘట్టాలు
ఈ వర్షాకాలం సీజన్ లో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతుండగా, దాదాపు అన్ని నదుల్లోనూ వరద నీరు ఉప్పొంగుతోంది. గత రెండు రోజులుగా గంగా నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రముఖ పుణ్యక్షేత్రమైన రుషికేశ్ ప్రాంతంలో గంగానది ఉగ్రరూపాన్ని దాల్చింది. సాధారణ స్థాయికి మించి వరదనీరు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉండటంతో, స్నాన ఘట్టాలన్నీ నీటిలో మునిగిపోయాయి. రుషీకేశ్ లో గంగానది ఒడ్డున ఉన్న భారీ శివుని విగ్రహం, వరద నీటిలో చిక్కుకుపోయింది. ఆ విగ్రహం వద్దకు వెళ్లే వంతెన పైనుంచి ప్రవహిస్తున్న వరద నీటిని ఈ వీడియోలో చూడవచ్చు.