నేను లవ్ చేసిన హీరోయిన్ వాణిశ్రీ: ఏపీ మంత్రి సోమిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను లవ్ చేసిన హీరోయిన్ వాణిశ్రీ: ఏపీ మంత్రి సోమిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

  • సౌత్ ఇండియన్ సినీ కల్చరల్ అసోసియేషన్ ప్రారంభం
  • అప్పటి సినిమాలు తీపి జ్ఞాపకాలు
  • వాణిశ్రీ నటించిన సినిమాలన్నీ చూశానన్న సోమిరెడ్డి
తాను యువకుడిగా ఉన్న రోజుల్లో సినిమాలను తెగ చూసేవాడినని, హీరోయిన్ వాణిశ్రీ అంటే తనకెంతో ఇష్టమని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో మరో మంత్రి నారాయణతో కలసి సౌత్ ఇండియన్ సినీ కల్చరల్ అసోసియేషన్ ను ప్రారంభించిన ఆయన, అనంతరం ప్రసంగించారు. తాను వాణిశ్రీని ప్రేమించానని, ఆమెకు వీరాభిమానినని, ఆమె చిత్రాలన్నీ చూశానని చెప్పారు. అప్పటి సినిమాలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని అన్నారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ అంబికా కృష్ణ, నటి వాణిశ్రీ, నటుడు భాగ్యరాజ్, నిర్మాత సీ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 26 నుంచి మూడు రోజుల పాటు షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నట్టు చెప్పిన అంబికా కృష్ణ, రూ. 4 కోట్ల లోపు తీసే చిత్రాలకు పన్ను మినహాయింపులు ఇవ్వనున్నామని తెలిపారు. రాష్ట్రంలో చిత్రాలను నిర్మించాలని చూసే వారికి లొకేషన్ల సమస్య రానీయబోమని, ఉత్తమ చిత్రాలకు రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహాన్ని అందిస్తామని తెలిపారు.
Somireddy
Vanisri
Narayana
Nellore

More Telugu News