Rains: నేడు మరింత బలపడనున్న అల్పపీడనం... తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలకు చాన్స్!

  • పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం
  • బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
  • నేడు మరింతగా బలపడనున్న అల్పపీడనం

తెలుగు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఇందుకు కారణం. పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, శనివారం నాడు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రుతుపవనాలు మరోసారి చురుకుగా మారనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నేడు అల్పపీడనం మరింతగా బలపడుతుందని, ఇప్పటికే కోస్తాంధ్రలో వర్షాలు ప్రారంభం కాగా, దక్షిణ ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు వర్ష తాకిడి అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వర్షాల కారణంగా, గోదావరి నదికి మరోసారి భారీ వరదలకు అవకాశాలు ఉన్నాయని వెల్లడిస్తున్నారు.

More Telugu News