Hindus: 'లవ్ రాత్రి' పేరు మార్చండి: జాతీయ హిందూ ఆందోళన డిమాండ్‌

  • హిందువులను కించపరిచేలా ఉందని ఆగ్రహం
  • బెంగళూరు జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా
  • వినతిపత్రం సమర్పణ

సల్మాన్‌ ఖాన్‌ నిర్మించిన 'లవ్ రాత్రి' సినిమాపై జాతీయ హిందూ ఆందోళన సమితి సభ్యులు మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ చిత్రం పేరును తక్షణం మార్చాలని డిమాండ్‌ చేస్తూ బెంగళూరులోని జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించుకునే సమయంలో ఈ చిత్రం విడుదల హిందువులను అవమానపర్చడమేనన్నారు. 27 ఏళ్లుగా సొంత రాష్ట్రాన్ని వదులుకుని పరాయి రాష్ట్రాలలో బతుకుతున్న కశ్మీర్‌ హిందువుల గురించి ఏ మాత్రం పట్టించుకోని పార్టీలు ఇతర దేశాల వారిపై జాలి చూపడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తక్షణం చిత్రం పేరు మార్చకుంటే ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు.

More Telugu News