ఏపీలో మందగించిన రుతుపవనాలు.. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
- ఏపీలో పొడి వాతావరణం
- రెండు మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు
- 26న అల్పపీడనం
గురువారం తిరుపతి, నెల్లూరులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే, వచ్చే 24 గంటల్లో మాత్రం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.