టీఆర్ఎస్ ఎంపీ కవిత ను కలిసిన బ్రిటిష్ హై కమిషన్ ఉన్నతాధికారులు
Add ap7am to your home Screen

టీఆర్ఎస్ ఎంపీ కవిత ను కలిసిన బ్రిటిష్ హై కమిషన్ ఉన్నతాధికారులు

  • నిజామాబాద్ లో పర్యటించనున్న నేపధ్యంలో కవితను కలిసిన బ్రిటిష్ హై కమీషన్ 
  • కాకతీయ తోరణం,గొల్లభామ చీరలు, భారతదేశ కోహినూర్ వజ్రం-తెలంగాణా పుస్తక బహూకరణ 
నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితను బ్రిటీష్ హై కమిషన్ ఉన్నతాధికారులు కైరన్ డ్రాకే, డిప్యూటీ హైకమిషనర్ ఆండ్య్రూ ఫ్లెమింగ్, రాజకీయ, ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్‌ తదితరులు బుధవారం ఆమె నివాసంలో కలిశారు. నిజామాబాద్ లో రెండు రోజుల పాటు వారు పర్యటించనున్న నేపధ్యంలో కవితను కలవడం జరిగింది. నిజామాబాద్ ఎంపీగా తాను చేస్తున్న అభివృద్ధి పనులను గురించి వారికి వివరించిన కవిత పసుపు బోర్డు ఏర్పాటుకు, రైలు సౌకర్యం కల్పించేందుకు తాను చేస్తున్న కృషిని వివరించారు.

ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్పిన కవిత అభివృద్ధిలో నంబర్ వన్ గా  నిజామాబాద్ ను నిలపాలనే తన సంకల్పాన్ని తెలిపారు. తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కవిత వారికి వివరించి చెప్పారు. భారతదేశ కోహినూర్ వజ్రం-తెలంగాణా అనే పుస్తకంతో పాటు సిద్ధిపేట ప్రాంతానికి చెందిన గొల్లభామ చీరలు, కాకతీయతోరణం ప్రతిమలను ఆమె ఈ సందర్భంగా వారికి బహూకరించారు. కవిత కృషిని వారు కొనియాడారు.
K Kavitha
Telangana
Hyderabad
Hyderabad District
Andrew Fleming

More Telugu News