jnnavitthula: నేను రాసిన శతకాలు .. పంచభూతాలకు అంకితం: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

  • చిన్నప్పుడే సాహిత్యంపై మక్కువ పెరిగింది
  • పద్యాలు .. పాటలు రాయడం మొదలు పెట్టాను
  • ప్రస్తుతం 24వ శతకం రాస్తున్నాను

పద్య కవిత్వంలోను .. గద్య కవిత్వంలోను జొన్నవిత్తులకి మంచి ప్రవేశం వుంది. ఇక సినిమా పాటలపైన .. పేరడీలపైన ఆయనకి మంచి పట్టు వుంది. శతక సాహిత్యంలో ఆయనదైన ప్రత్యేక ముద్ర కనిపిస్తుంది. అలంటి జొన్నవిత్తుల గారు, తాజాగా 'చెప్పాలని వుంది' కార్యక్రమంలో మాట్లాడుతూ తాను రాసిన శతకాలను గురించి ప్రస్తావించారు.

"చిన్నతనం నుంచి నాకు సాహిత్యంపట్ల మక్కువ ఎక్కువగా ఉండేది. అందువలన పద్యాలు .. పాటలు రాస్తూ వుండేవాడిని. ప్రస్తుతం 24వ శతకం రాస్తున్నాను. 'దివిసీమ'లో మా అమ్మ పుట్టిల్లు వుంది. ఆ అనుబంధంతో 'దివిసీమ శతకం'ను రాసి ఆకాశానికి అంకితం ఇచ్చాను. 'కోనసీమ శతకం' రాసి వాయుదేవుడికి అంకితం ఇచ్చాను. 'ఉత్తరాంధ్ర శతకం' సముద్రుడికి అంకితం ఇస్తాను. ఇక ప్రస్తుతం రాస్తోన్న 'యజ్ఞేశ్వర శతకం'ను అగ్నిదేవుడికి అంకితం చేస్తాను. నేను విజయవాడలో పుట్టాను కాబట్టి 'విజయవాడ శతకం' రాశాను .. అది భూదేవికి అంకితం చేశాను" అని చెప్పుకొచ్చారు.  

More Telugu News