raja singh: ముందస్తు చర్యగా ఎమ్యెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

  • గోరక్షకులపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ రాజాసింగ్ దీక్ష
  • పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేస్తానంటూ ప్రకటన
  • ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను హైదరాబాద్ ధూల్ పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోరక్షకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించిన రాజాసింగ్... ఈరోజు బషీర్ బాగ్ లోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ముందు నిరవధికదీక్ష చేపడతానని ప్రకటించారు. ఈ దీక్షకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ముందస్తు చర్యగా ఆయనను అరెస్ట్ చేశారు.

తాను చేపడుతున్న గో రక్షణ ఉద్యమానికి, బీజేపీకి లింక్ పెడుతున్నారని... ఈ నేపథ్యంలో పార్టీకి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పదవికి రాజాసింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు పంపించారు. అయితే, ఆయన రాజీనామాను పార్టీ ఇంత వరకు ఆమోదించలేదు. 

More Telugu News