'గీత గోవిందం' టికెట్లను బ్లాక్ చేస్తున్న హైదరాబాద్ 'సంధ్య' థియేటర్ యాజమాన్యం... కేసు పెట్టడంతో పరారీలో!
- హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న 'గీత గోవిందం'
- ప్రేక్షకులు ఎగబడుతుండటంతో స్వయంగా దందా
- ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
- పరారీలో యజమాని సందీప్, మేనేజర్ రామారావు
చిక్కడ్ పల్లి పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో ఆదివారం సెకండ్ షోకు ముందు మఫ్టీలో వెళ్లి దాడులు చేయగా, బ్లాక్ టికెట్లు అమ్ముతున్న ఏడుగురు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 75 టికెట్లను స్వాధీనం చేసుకుని, ఆపై విచారించారు. తమకీ టికెట్లను థియేటర్ యజమానులు సుమిత్ సందీప్, మేనేజర్ రామారావు, గీతా ఆర్ట్స్ ప్రతినిధి శంకర్ లతో పాటు సుబ్బమ్మ అనే వారు ఇచ్చారని వారు చెప్పడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. టికెట్లు ఇచ్చిన వారంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.