kerala: కేరళ వరదలను తీవ్రమైన ప్రకృతి విపత్తుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం

  • కేరళలో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం
  • నిరాశ్రయులైన లక్షలాది మంది ప్రజలు
  • కేంద్రం నిర్ణయం పట్ల సర్వత్ర వ్యక్తమవుతున్న హర్షం

భారీ వరదలతో కేరళ అతలాకుతలమయింది. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. దీంతో, కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో, కేరళ వరద బీభత్సాన్ని తీవ్రమైన ప్రకృతి పపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ప్రకటన నేపథ్యంలో కేరళకు ఆర్థిక సాయంతో పాటు సహాయ, పునరావాస కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కలసి, కేంద్రం పనిచేయనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. 

More Telugu News