asian games: ఆసియా క్రీడల్లో నేలకొరిగిన జాతీయ జెండాలు!

  • చైనా ఆసియా క్రీడల్లో దొర్లిన అపశ్రుతి
  • పతకాల బహూకరణ సమయంలో నేలకొరిగిన జాతీయ జెండాలు
  • అక్కడున్న వారంతా షాక్ కు గురైన వైనం

ఇండొనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అపశ్రుతి దొర్లింది. 200 మీటర్ల పురుషుల స్విమ్మింగ్ ఫ్రీస్టైల్ విభాగం ఫైనల్లో చైనాకు చెందిన సున్ యాంగ్ గోల్డ్ మెడల్ సాధించగా... జపాన్ కు చెందిన మత్సుమోటో, చైనాకు చెందిన జీ జింజీలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. పోటీ ముగిసిన తర్వాత పతకాల బహూకరణ కార్యక్రమం ప్రారంభమైంది.

 ఈ సందర్భంగా చైనా, జపాన్ లకు చెందిన జాతీయ పతాకాలను ఎగురవేశారు. చైనా గోల్డ్ మెడల్ సాధించిన నేపథ్యంలో, ఆ దేశ జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో ప్రమాదవశాత్తు జెండాలు కిందకు పడిపోయాయి. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత అధికారులు జెండాలను చేతులతో పట్టుకోగా... పతకాల బహూకరణ కార్యక్రమాన్ని ముగించారు. ఈ ఘటన నిన్న చోటు చేసుకుంది.

More Telugu News